mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇద్దరు చిన్నారులను చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం

1 గంట క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 10:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో మంగళవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి హతమార్చిన తల్లి అనంతరం తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం... రణస్థలం మండలం బంటుపల్లికి చెందిన వరలక్ష్మికి వెదుళ్లవలసకు చెందిన కూర్మాపు రమణతో 2020లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు భవాని (3), చాందిని (నాలుగు నెలలు) ఉన్నారు. ఉపాధి నిమిత్తం తెలంగాణ రాష్ట్రం నల్గొండలో రోజువారి కార్మికుడిగా రమణ పనిచేస్తున్నారు. వరలక్ష్మి, ఆమె అత్త లక్ష్మి, లక్ష్మి తల్లి మద్దునూరి బావాజమ్మ అందరూ కలిసి వెదుళ్లవలసలో నివసిస్తున్నారు. వరలక్ష్మి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి సోమవారం రాత్రి ఇంట్లో నిద్రించగా, లక్ష్మి, బావాజమ్మఇంటి బయట నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున లక్ష్మి... ఇంటి తలుపులు తెరిచి చూడగా ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడి ఉన్నారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో వరలక్ష్మి ఉండడంతో హుటాహుటినా శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్