mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దక్షిణ కొరియా మాజీ మంత్రికి 25 ఏళ్ల జైలుశిక్ష

22 జూన్, 2026

South Korea ex-Minister
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 02:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సియోల్ : దక్షిణ కొరియా మాజీ న్యాయశాఖ మంత్రికి న్యాయస్థానం సోమవారం 25 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 2024లో మాజీ అధ్యక్షుడు యున్ సుక్ యోల్ విధించిన సైనికపాలన (మార్సల్ లా) ప్రకటనలో మంత్రి పార్క్ సంగ్ జేను సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు దోషిగా తేల్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. సైనిక పాలన విధించిన కొన్నిగంటల్లోనే పార్క్ న్యాయమంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారని, ఒక వేళ అధికారులు ప్రభుత్వ వ్యతిరేక వ్యక్తులను అరెస్ట్ చేస్తే, జైళ్ల సామర్థ్యంపై పరిశీలించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. పార్క్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి చట్టాన్ని తిరుగుబాటు సాధనంగా మార్చారని, చట్టబద్ధమైన పాలనకు సవాలు విసిరారని వారు వాదించారు. ఆయన ఏమాత్రం పశ్చాత్తాపం చూపలేదని అన్నారు. యూన్ విధించిన మార్షల్ లా ఆరుగంటలు మాత్రమే కొనసాగింది. ప్రకటన వెలువడిన వెంటనే చట్టసభ సభ్యులు అత్యవసర సమావేశంలో ఆ ప్రకటనను తిరస్కరించారు. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన యూన్ సుక్ యోల్ ను దోషిగా నిర్థారించిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్