శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionముద్దు నాయనా..!

2 గంటల క్రితం

kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 03:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముద్దు నాయనా..!

మన వీథి బడికి వెళ్లి

బుద్ధితో చదువుకో

అభివృద్ధిలోకి వస్తావు...!


పలకా బలపం పట్టి

అక్షరాలను సరిదిద్దుకో

అజ్ఞానం పోగొట్టుకొని

విజ్ఞానాన్ని పొందుతావు...!


పాఠాలను చదువుకో

ఘనసారాన్ని తెలుసుకో

పొంగారు భవిత నీదే

బంగారు పతకం నీదే..!


తల్లిదండ్రుల మాటలు విను

చెడు సావాసాలు చేయొద్దు

మత్తు మందు జోలికి వెళ్లకు

నీ బతుకును వికృతి చేసుకోవద్దు..!


రేపటి పౌరులు మీరే

సరిహద్దుల వీరులు మీరే

ఉన్నత చదువులు చదివి

ఊరికి ఉపకారిలా మారాలి

రేపటి తరానికి ఆదర్శం కావాలి!

- జి. సూర్యనారాయణ, 62817 25659.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్