ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్ : తెలుగు సినీలాకాశం లో ధ్రువతార, దేశం గర్వించదగ్గ మహానటుడు , విశ్వ నట చక్రవర్తి ఎస్.వి రంగారావు శిలా విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. ఆయన విగ్రహాన్ని తొలగించి, ముసుగేసి ఉంచడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జులై 3న ఎస్.వి.రంగారావు పుట్టినరోజు కావడంతో రాష్ట్రంలో పలు చోట్ల ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. ధవలేశ్వరం గ్రామంతో ఆయనకు ఉన్న అనుబంధం కారణంగా ఆయన అభిమానులు 2012లో బ్యారేజీ పక్కన ప్రధాన రోడ్డుకానుకుని విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహావిష్కరణకు మెగాస్టార్ , మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి రావలసి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆయన రాలేదు. దీంతో అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర మంత్రి కందులు దుర్గేష్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.అయితే ఏం జరిగిందో తెలియదు కానీ గత కొంతకాలంగా అక్కడి నుండి విగ్రహాన్ని తొలగించి నడి రోడ్డు పక్కన ముసుగేసి ఉంచడం పట్ల ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విగ్రహానికి ముసుగు తీసి, మెరుగులు దిద్ది ఆవిష్కరించాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
విశ్వ నట చక్రవర్తి ఎస్.విరంగారావు శిలా విగ్రహానికి ఘోర అవమానం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 03:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)