mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెనాలిలో ఘనంగా రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ ఉత్సవాలు

20 జూన్, 2026

Two-Year Development and Welfare Celebrations Held Grandly in Tenali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 12:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తెనాలి రూరల్ (గుంటూరు) : సుపరిపాలన, రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ ఉత్సవాలను తెనాలి నియోజకవర్గంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా .... కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధి పనులను నియోజక వర్గ ప్రజలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. తొలుత మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిధిలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెనాలి కొల్లిపర నుంచి వచ్చిన పార్టీ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి బిజెపి సమన్వయకర్త వాసుదేవర నాయుడు, టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మణిక్యరావు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్