గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గుమ్మళ్ళ శ్రీరాములుకు నివాళులర్పించిన సిపిఎం నేతలు

1 గంట క్రితం

ramulu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 12:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కొండపి : కొండేపి మండలం పెరిదేపి గ్రామ మాజీ సర్పంచ్ గుమ్మల వెంకటేశ్వర్లు తండ్రి గుమ్మల శ్రీరాములు (82) వయోభారంతో బుధవారం చనిపోయారు. గురు వారం వారి భౌతికాయాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జీవీ కొండారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, యం రమేష్, సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య, జిల్లా నాయకులు గంటెనపల్లి వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సిపిఎంకు గట్టి సానుభూతిపరుడుగా ఉండి అనేక ఉద్యమాలు, ఒడిదుడుకుల్లో శ్రీరాములు నికరంగా నిలబడ్డారని అన్నారు. వారి కుటుంబం అంతా సిపిఎంతో సుదీర్ఘకాలం నుండి నిలబడిందని తెలిపారు. శ్రీరాములు మృదుస్వభావి అని, వివాద రహితుడని, కులమత బేధాలకు భిన్నంగా అందరితో కలిసి మెలిసి జీవించే వ్యక్తిని అన్నారు. సిపిఎం పార్టీని గ్రామంలో బలంగా నిలబెట్టడంలో ఆయన వంతు పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం వారి కుటుంబంతో పాటు సిపిఎం పార్టీ కూడా లోటు అని అన్నారు. ఆయన మృతికి సిపిఎం జిల్లా కమిటీ తరఫున సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ అంత్యక్రియల్లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కేజీ మస్తాన్, వి.బాలకోటయ్య, పొందూరు శాఖ కార్యదర్శి వేజెండ్ల సింగయ్య, మండల కార్యదర్శి మల్లెల కొండయ్య, మండల కమిటీ సభ్యులు ముప్పరాజు చిన్న బ్రహ్మయ్య, మల్లెల చిన్న పేతురు, అంగలకుర్తి చిన్న బ్రహ్మయ్య, మిట్టపాలెం శాఖ కార్యదర్శి లెక్కిపోగు సుధాకర్ సీనియర్ నాయకులు గడ్డం పిచ్చయ్య, మాజీ ఎంపీటీసీ మల్లెల పెద్ద పేతురు, ఎల్ పరిశుద్ధ రావు, టీడీపీ వైసిపి వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్