గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తెనాలి టూ టౌన్ సిఐగా రవీంద్రబాబు బాధ్యతల స్వీకరణ

2 గంటల క్రితం

Ravindra Babu assumes charge as Tenali Two-Town CI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 03:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తెనాలిరూరల్ : తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ)గా డి. రవీంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పదోన్నతి పొందిన ఆయనకు సీఐగా తొలి పోస్టింగ్ తెనాలిలో లభించింది. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. 2009 బ్యాచ్‌కు చెందిన రవీంద్రబాబు గతంలో తెనాలి మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా, అనంతరం బాపట్ల జిల్లా చుండూరులో సేవలందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రవీంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తెనాలిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తానని అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టి, తెనాలిని గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తానని, వారి సహకారంతో నేరాల నియంత్రణకు కట్టుబడి పనిచేస్తానని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్