ప్రక్కదండులు ఊడిపోతున్న వైనం - మిల్లు యజమానుల ఆవేదన
ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : మండలంలో రైసు మిల్లులకు ప్రభుత్వ సివిల్ సప్లై శాఖ నుండి వస్తున్న బియ్యం గోనె సంచులు నాశిరకంవి కావడంతో బియ్యం ఎగుమతి చేసే సమయంలో ఇబ్బందులు పడుతున్నామని రైసు మిల్లుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం 50 కేజీలు పట్టే విధంగా సంచులు పంపాల్సి ఉండగా సంచులు తక్కువవి పంపడంతో 50 కేజీలు బియ్యం పట్టడం లేదని చెప్పారు. బియ్యం పట్టే విధంగా సంచిని గట్టిగా కుదేస్తే సంచి పక్కన ఉన్న దండులు ఊడిపోయి బియ్యం సంచి నుండి బయటకు పడిపోవడం వలన బియ్యాన్ని లారీలో ఎగుమతి చేయడానికి ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. సంచులు చిరిగి పోవటంవలన చాలవరకు సంచులు రద్దుగా పోతున్నట్లు చెప్పారు. సివిల్ సప్లై శాఖ అధికారులు సంచులు నాణ్యత పై దృష్టి పెట్టి మిల్లులకు 50 కేజీలు బియ్యం పట్టే విధంగా సంచులను తయారు చేసి నాణ్యమైన సంచులు పంపాలని సివిల్ సపై శాఖ అదికారులను కోరుతున్నారు.









కామెంట్‌లు (0)