అల్లరి నరేశ్ నటిస్తున్న 65వ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫాంటసీ, వినోదం కలగలిసిన ఈ చిత్రానికి ‘కామెడీ గోస్ కాస్మిక్’ అనే ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు. మంగళవారం అల్లరి నరేశ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
అల్లరి నరేశ్ ‘రంభ ఊర్వశి మేనక’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 08:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)