బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పొలంలో ఉండగానే ... గుండెపోటుతో రైతు మృతి

20 జూన్, 2026

farmer die with heartattack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 12:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


ప్రజాశక్తి - బ్రహ్మంగారిమఠం (కడప) : పొలంలో ఉండగానే గుండెపోటుతో రైతు మృతి చెందిన ఘటన శనివారం చౌదరవారిపల్లి గ్రామంలో జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలంలోని చౌదరవారిపల్లి గ్రామానికి చెందిన అన్నపురెడ్డి రామిరెడ్డి (48) తన వ్యవసాయ పొలంలో నారుమడికి తయారు చేసుకునేందుకు వెళ్లి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అటువైపు పశువులను మేపుకొనేందుకు వెళుతున్న ఓ మహిళ చూసి వెంటనే గ్రామస్తులకు తెలపడం జరిగింది. గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన రామిరెడ్డిని అతడి నివాస గృహానికి తీసుకువెళ్లారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్