చెన్నై : తాము ఏ కూటమిలోనూ భాగం కాదని వామపక్షాలు బుధవారం ప్రకటించాయి. టివికె వ్యవస్థాపకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అధికారంలో భాగస్వామ్యమైన పార్టీలకు నేడు చిన్న సమావేశం విందును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి వామపక్షాలు హాజరుకాలేదు. ఈ విషయంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్ మాట్లాడుతూ.. తాము ప్రభుత్వానికి బయటి నుండి మద్దతునిస్తాము కానీ ఏ కూటమిలోనూ భాగస్వామ్యం కాదని స్పష్టం చేశారు. కూటమిలో భాగమని భావన కలిగించేందుకు సుముఖంగా లేమని అన్నారు. కార్మికులు, సమాజంలోని ఇతర వర్గాల సమస్యలను సిఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు త్వరలో ఆయనతో సమావేశమవుతామని వామపక్షాల పార్టీలు తెలిపాయి.
మేము ఏ కూటమిలోనూ భాగం కాదు : వామపక్షాలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 01, 2026, 05:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)