డెహ్రాడూన్ : మదర్సా బోర్డుల విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన బోధన ఒక్కటే ఈ తరానికి సరిపోదని, ఆధునిక విద్యా ప్రమాణాలు అందితేనే విద్యార్థులకు మంచిదని ప్రభుత్వం భావించి ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మదర్సాలు రద్దు కానున్నాయి. కొత్త నిబంధన ప్రకారం.. గుర్తింపు కలిగిన మదర్సాలు ఇకపై సాధారణ స్కూల్స్‌గా పరిగణిస్తారు. ఈ మదర్సాలన్నీ రాష్ట్ర మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ అథారిటీ కిందికి రానున్నాయి. దీంతో ఇకపై మదర్సాలు సాధారణ విద్యా వ్యవస్థలోకి వస్తాయి. ఈ స్కూల్స్‌లో సాధారణ సిలబస్‌నే బోధించాలి. ఇతర పాఠశాలల్లోలాగే విద్య అందించాలి. స్కూల్స్‌కు వర్తించే నిబంధనలే మదర్సాలకు కూడా వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల ఆధునిక సబ్జెక్టులను సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ వంటివి బోధిస్తారు. ఒకవేళ ఈ నిబంధనలు పాటించకుంటే, సరైన విద్యా బోధన చేయకుంటే ప్రభుత్వం అలాంటి మదర్సాలపై చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అనుమతి లేకుండా 500 వరకు మదర్సాలు ఉన్నాయని లెక్కలు చూపిస్తున్నాయి. ఇకపై వీటికి అనుమతి పొందకపోయినా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేకుండా ఉన్నా వాటిని మూసేస్తారు.
మదర్సా బోర్డు రద్దు చేసిన ఉత్తరాఖండ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 01, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)