mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పరిశుభ్రత ప్రధాన ధ్యేయం

5 గంటల క్రితం

garbage
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 10:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజంపేట : పరిశుభ్రతే ప్రధాన ధ్యేయమని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. కూచివారిపల్లె గ్రామ పంచాయతీలోని ఎన్టీఆర్ కాలనీలో బుధవారం పంచాయతీ అధికారులు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి స్వచ్ఛ పధం కార్యక్రమంలో చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ నినాదంతో ప్రారంభమైన ఈ ప్రయాణం, 'స్వచ్ఛ పథం’ రూపంలో ప్రతి బుధవారం పల్లె గడపను తడుతోందని అన్నారు. గతంలో పారిశుధ్యం అంటే కేవలం మురుగు కాలువలు శుభ్రం చేయడం అనే పరిమిత భావన ఉండేదని, కానీ ఇప్పుడు రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్తను శాశ్వతంగా తొలగించడం, ఆ చెత్తను శాస్త్రీయంగా పునశ్చక్రీకరణ చేయడం అనే ఉన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమం సాగుతోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మేడికొండ రవికుమార్ నాయుడు, సొసైటీ చైర్మన్ ముల్లగూరి సుబ్రహ్మణ్యం నాయుడు, పోలి నీటి సంఘం చైర్మన్ నాగినేని నాగేశ్వర్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి జీ.వీ సుబ్బరాజు, గ్రామ సీనియర్ నాయకులు అమ్మినేని వెంకటయ్య నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ రామ నర్సింహులు నాయుడు, మండల క్లస్టర్ ఇంచార్జ్ దగ్గుబాటి వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్