బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సిహెచ్సి లో మాస్టర్ ఆఫ్ సర్జన్ సేవలు అందుబాటు : డాక్టర్ ప్రసన్న

1 గంట క్రితం

సిహెచ్సి లో మాస్టర్ ఆఫ్ సర్జన్ సేవలు అందుబాటు : డాక్టర్ ప్రసన్న
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 03:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ఆలమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మాస్టర్ ఆఫ్ సర్జన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆ విభాగపు వైద్యాధికారిని డాక్టర్ సిహెచ్.ప్రసన్న తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె సిహెచ్సి లో రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాశక్తితో ఆమె మాట్లాడుతూ ఇటీవల ఔట్ పేషెంట్ల రద్దీ పెరుగుతుందని పలువురు రోగులు తమ వద్ద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. అలాగే ఎవరికైనా జనరల్ సర్జన్ విషయంలో అనుమానాలు ఏమైనా ఉంటే సంప్రదించాలని తప్పకుండా నివృత్తి చేస్తామని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా మూలస్థానానికి చెందిన ఉప్పులూరి రమణయ్య అనే భట్టి యజమాని నాలుగేళ్ల క్రితం తన పాదానికి గాయం కాగా షుగర్ వ్యాధి ఉండటంతో అది అంతకంతపు పెరిగి గాయం ముదిరింది. దీంతో రాజమహేంద్రవరంలో పలు ప్రైవేటు వైద్యశాలల్లో సుమారు నాలుగున్నర లక్షల రూపాయల వరకు వెచ్చించిన తనకు ఆ గాయం నయం కాలేదని, కనీసం కుట్లు వేసిన ఉండేవి కాదని ఆయన వాపోయారు. దీంతో ఆలమూరు సిహెచ్ లో ప్రత్యేక వైద్యులు ఉన్నారని తెలిసి, ఇక్కడకు వచ్చి డాక్టర్ ప్రసన్న ద్వారా వైద్యం పొందానన్నారు. దీంతో గాయం కాస్త పూర్తిగా తగ్గుముఖం పట్టిందని ఆనందం వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్