రాష్ట్రంలో ప్రథమ స్థానంలో విక్టరీ కోచింగ్ సెంటర్
ప్రజాశక్తి-కోటనందూరు (కాకినాడ) : మండల కేంద్రమైన కోటనందూరులో విక్టరీ స్టడీ సర్కిల్లో ఈ ఏడాది 21 నవోదయ సీట్లు కైవసం చేసుకోవడం జరిగిందని విక్టరీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి. చిన్ని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయిలోనే నవోదయలో అత్యధిక సీట్లు కైవాసం చేసుకున్న ఏకైక విక్టరీ స్టడీ సర్కిల్ ప్రత్యేకత అని అన్నారు. ఎటుపాక నవోదయ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యను అభ్యసించేందుకు అర్హత సాధించారని డైరెక్టర్ పి.చిన్ని తెలిపారు. ఈ సంవత్సరం ఆరో తరగతికి 18 విద్యార్థులు, 9వ తరగతికి 3 ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఆంధ్ర తెలంగాణలో ఉన్న కోచింగ్ సెంటర్ల సాధించలేని ఘనత మారుమూల ప్రాంతమైన మండల కేంద్రమైన కోటనందూరు లో ఉన్న విక్టరీ స్టడీ సర్కిల్ 21 సీట్లు సాధించడంపై విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు కూడా అల్లిపూడి గ్రామానికి చెందిన గుంటపల్లి దుర్గ నాగ వీర మహేష్ తొమ్మిదో తరగతి నవోదయ ఎంపికైనట్లు నవోదయ విద్యాసంస్థ ప్రకటించాయి. ఎంపికైన మహేష్ విద్యార్థిని స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి.చిన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పి. చిన్ని మాట్లాడుతూ గ్రామీణ,పట్టణ ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులను విద్యాపరంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని లక్ష్యంతోనే గత 15 సంవత్సరాల కాలం నుండి వందలాది మంది విద్యార్థిని విద్యార్థులకు విక్టరీ సర్కిల్లో కోచింగ్ ఇవ్వడం జరిగిందని, వందకు మంది 102మందికి పైగా నవోదయలో సీట్లు సాధించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్టరీ స్టడీ సర్కిల్ ఉపాధ్యాయులు జయరాజ్, విశ్వ చైతన్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)