ప్రజాశక్తి-అమలాపురం రూరల్ (కోనసీమ) : వైద్య సేవలను సమాజానికి అంకితం చేసిన వైద్యులను గౌరవిస్తూ డాక్టర్స్ డే వేడుకలను బుధవారం అల్లవరం సి హెచ్ సి లో సూపరింటెండెంట్ డా. ఎన్. రాకేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పలువురు వక్తలు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. రోగులకు నిస్వార్థ సేవలు అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. పి వి పృథ్వీరాజ్, డా ఎం ప్రమోద్, డా టి సందీప్, డా ఎం లక్ష్మణరావు, డా ఎస్ స్వాతి, డా ఏ లక్ష్మీ లలిత, డా బి ప్రశాంతి, ఫార్మసిస్టు రమాదాస్, స్టాఫ్ నర్స్ కుమారి, నాగేంద్ర కుమారి, రాజు, సతీష్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా డాక్టర్స్ డే దినోత్సవం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 01, 2026, 04:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)