ప్రజాశక్తి-కాకినాడ : జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిగా జ్యోతుల రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పిఆర్ కళాశాలలోని ఆయన చాంబర్ లో రాంబాబు వేద మంత్రోచ్ఛరణలతో సిబ్బంది సమక్షంలో బాధ్యతలను చేపట్టారు. రాంబాబు ఇప్పటివరకు పిఆర్ కళాశాలకు ప్రిన్సిపల్ గాను వ్యవహరించి ఇంటర్ విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇంటర్ విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించిన వి కేశవరావు మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా రాంబాబు పలువురు కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపల్స్, సిబ్బంది అభినందించారు.
ఇంటర్ విద్యాధికారిగా రాంబాబు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 01, 2026, 04:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)