బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

AP EAPCET 2026 - ఎపి ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల

2 గంటల క్రితం

AP EAPCET Results Released
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 05:05 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : ఎపి ఎప్‌సెట్‌ ఫలితాలు (AP EAPCET 2026 Results) బుధవారం విడుదలయ్యాయి. లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ ఫలితాలను ఎపి విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ విభాగంలో 2,76,572మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,545 మంది హాజరయ్యారు. వీరిలో 1,82,317మంది (70.52%) క్వాలిఫై అయినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. అలాగే, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా విభాగంలో 79,231మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929మంది హాజరయ్యారు. వీరిలో 63,546 మంది (89.59%) క్వాలిఫై అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ లింక్ పై క్లిక్ చేసి ఎప్ సెట్ ఇంజినీరింగ్ ఫలితాలు చూడవచ్చు.

https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

ఈ కింది లింక్ పై క్లిక్ చేసి AP EAPCET result 2026 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx




టాప్‌ 10 ర్యాంకర్లు వీరే ..


ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో టాపర్లు..


జొన్నల రోషన్‌ మణిదీప్‌ రెడ్డి - గుంటూరు జిల్లా

కోరుకొండ శ్రావ్య - శ్రీకాకుళం

వెన్న ప్రవీణ్‌ కుమార్ రెడ్డి - పల్నాడు

తుంగ దుర్గా సుప్రభాత్‌ - పల్నాడు

తెల్లూరి శ్రేయస్‌ రెడ్డి - హైదరాబాద్‌

ముక్కార సాకేత్‌ - వైఎస్‌ఆర్‌ కడప

బండి వెంకట సాత్విక్‌ - గుంటూరు

నూర్‌ బాషా హఫీజ్‌ - గుంటూరు

పసల మోహిత్‌ - కడప

మరక వంశీధర్‌ రెడ్డి - వైఎస్‌ఆర్‌ కడప


అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా స్ట్రీమ్‌లో టాపర్లు ....


శంబంగి జశ్వంత్‌ నాయుడు - విజయనగరం

కుడుముల వెంకట మహంత్‌ అక్షజ్‌ రెడ్డి - మేడ్చల్‌ మల్కాజ్‌గిరి

కొండ్రెడ్డి హారికాదేవి శ్రీ అనూహ్య - కృష్ణా

కర్రి సత్యనారాయణ - కాకినాడ

బంటు ధాత్రిక - అనకాపల్లి

పల్లికొండ దర్శ్‌తేజ - కాకినాడ

వల్లెపు ధీరజ్‌ కృష్ణ - గుంటూరు

దండమూడి జాగృతి - గుంటూరు

ఆళ్ల శ్రీలక్ష్మి సత్యసాయి నిఖితారెడ్డి - పల్నాడు

రేలంగి జయ షణ్ముఖి - విజయనగరం




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్