mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘లెనిన్’ ట్రైలర్ లాంచ్: మాస్ లుక్‌లో అఖిల్

1 గంట క్రితం

lenin
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 08:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని, లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం వైజాగ్‌లో మేకర్స్ ఘనంగా విడుదల చేశారు.ఈ భారీ చిత్రాన్ని కింగ్ అక్కినేని నాగార్జున, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. జులై 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

పక్కా రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాగా, రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ధర్మరాజు, శ్రీరామాపురం, కురుక్షేత్రం వంటి పురాణ ప్రస్తావనలను నేటి గ్రామీణ రాజకీయాలు, వర్గ పోరాటాలకు ముడిపెడుతూ దర్శకుడు మురళీ కిషోర్ కథను అద్భుతంగా ఆవిష్కరించారు. ‘కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు..’ అంటూ వచ్చే వాయిస్ ఓవర్, అఖిల్ రగ్గడ్ అండ్ మాస్ లుక్ థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ఆయన చెప్పిన డైలాగులు, యాక్షన్ సీక్వెన్సులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లగా.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన నటనతో, గ్లామర్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్