mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్‌

1 గంట క్రితం

i phone 18
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 10:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • టాటా ఎలక్ట్రానిక్స్‌‌పై హ్యాకర్ల దాడి

  • ఆపిల్‌ కంపెనీ ఆందోళన

చెన్నయ్‌ : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్‌కు భారత్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్‌లో హ్యాకర్లు దాడి చేసి ఐఫోన్‌ 18 ప్రో ఫోన్‌‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్‌ ‌చేశారు. ఈ కథనాలపై ఆపిల్‌ ‌సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. షెడ్యూలు ప్రకారం..ఈ ఏడాది సెప్టెంబరులో ఐఫోన్‌ 18 ప్రో విడుదల కావాల్సివుంది. అయితే ఈ లోపే ఆ ఫోన్‌కు సంబంధించిన డిటైల్స్‌, డిజైన్‌ ‌వంటి వివరాలను ‘వరల్డ్ లీక్స్’ అనే రాన్సమ్‌వేర్ ముఠా తాజాగా డార్క్ వెబ్‌లో రహస్య సమాచారం బహిర్గతం చేసింది. ఈ లీకైన పత్రాల్లో ఐఫోన్ 18 ప్రో మోడళ్లకు సంబంధించిన పరికరాలు, వాటిని సరఫరా చేసే కంపెనీల జాబితా, బ్యాటరీ, కెమెరా, మెయిన్ సర్క్యూట్ బోర్డ్ భాగాల వివరాలతో పాటు టాటా ప్లాంట్‌లో నిర్వహించిన డ్రాప్ టెస్ట్ కు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఆపిల్ తన సరఫరాదారుల వివరాలను ఎక్కడా బయటపెట్టదు. కానీ ఈ లీక్ ద్వారా ఆ వివరాలన్నీ వెల్లడి కావడంతో ఆపిల్, టాటా భాగస్వామ్య విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఆపిల్ అంతర్గత విచారణ చేపట్టింది. టాటా ఎలక్ట్రానిక్స్ తన సిస్టమ్స్‌లో యాక్సెస్‌ను నియంత్రించడంతో పాటు ఫోరెన్సిక్ ఆడిట్ కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్‌ను నియమించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్