గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మణిపూర్‌ హింస, ద్వేషం కారణంగా 20 ఇళ్లు దగ్ధమయ్యాయి : రాహుల్‌‌ కేంద్రంపై ఫైర్‌

4 గంటల క్రితం

rahul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 04:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : మణిపూర్‌లో చెలరేగిన హింస వల్ల 20 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన గురించి వార్తపై లోక్‌‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ ‌గాంధీ స్పందించారు. ఇలాంటి ఘటనకు బిజెపినే కారణమని ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కాగా, ‘మణిపూర్‌ గత కొన్నేళ్లుగా మండిపోతోంది. నేడు మరోసారి ద్వేషం, హింస అనే మంటల్లో 20 ఇళ్లు బూడిదయ్యాయి. డబుల్‌ ఇంజన్‌ ‌సర్కార్‌, రాష్ట్రపతి పాలన ఉన్నప్పటికీ, ఆ వివాదం మరింత తీవ్రమవుతూనే ఉంది. ఈ హింస వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. మణిపూర్ పడుతున్న భరించలేని వేదన ఊహించడం కూడా కష్టమే’ అని రాహుల్‌ ఎక్స్‌ ‌పోస్టులో పేర్కొన్నారు.

మతం, కులం, భాష, ప్రాంతం, గుర్తింపు పేరిట ప్రజలను విభజించే మోడీ ప్రభుత్వపు విభజనవాద భావజాలం యొక్క ఫలితం ఇది. నేడు మణిపూర్ మాత్రమే కాదు.. యావత్ దేశం కూడా ప్రధాన మంత్రి నుండి కనీసం రెండు సానుభూతి మాటలనైనా వినగలమన్న ఆశను వదిలేసింది. ఇక ఏదైనా చర్య తీసుకుంటారన్న మాటే లేదు. మణిపూర్ మెరుగైన స్థితికి అర్హత కలది. దానికోసం, భారతదేశాన్ని ఏకం చేయడమే ఏకైక మార్గం అని రాహుల్‌ ఎక్స్‌ ‌పోస్టులో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్