mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఎపి డిప్యూటి సిఎం పవన్‌ భేటీ

3 గంటల క్రితం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 03:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై నేతలు చర్చించారు. ముంబయిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ... ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయన్నారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఈ సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్