భోపాల్ : బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. పోలింగ్ జూలై 30న, ఎన్నికల ఫలితాలు ఆగస్టు 3న వెల్లడించనున్నట్లు ఇసి ప్రకటన పేర్కొంది.
కాగా, మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత కారణంగా ఖాళీ అయింది. మోసం కేసులో దోషిగా తేలడంతో ఆయన రాష్ట్ర శాసనసభ సభ్యత్వం నుండి అనర్హుడిగా ప్రకటించబడ్డారు. గుజరాత్‌లోని మంజల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా జూలై 30న ఉప ఎన్నికలు జరుగుతాయి.
బీహార్‌లో బంకీపూర్ స్థానానికి నితీన్ నబీన్ రాజీనామా చేయడం.. మంజల్‌పూర్ బిజెపి ఎమ్మెల్యే యోగేష్‌భాయ్ నారందాస్ పటేల్ మరణం కారణంగా ఈ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది.







కామెంట్‌లు (0)