కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్. కె. ఎన్., సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై 24న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. 'లవ్ కార్నివల్' పేరుతో ప్రత్యేక ఈవెంట్‌ను జూలై 4న సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో నిర్వహించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
Print Edition4న విజయవాడకు 'చెన్నై లవ్ స్టోరీ' బృందం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 09:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)