తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’ త్వరలో థియేటర్లలోకి రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో తలెత్తిన వివాదాల కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఇటీవల చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో మేకర్స్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి, పైరసీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకు న్నారు. విడుదల పదేపదే వాయిదా పడటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తికావడంతో ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Print Edition31న జననాయగన్ విడుదల?
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 09:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)