గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘ఖాషాబా’ జీవిత కథ...

2 గంటల క్రితం

khabhasha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో దేశానికి తొలి పతకం అందించిన లెజెండరీ రెజ్లర్ ఖాషాబా దాదాసాహెబ్ జాదవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక బయోపిక్ ‘ఖాషాబా’. ‘సైరాట్’ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు నాగ్‌రాజ్ మంజులే ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఎలాంటి ఆధునిక వసతులు, ఆర్థిక సహాయం లేని రోజుల్లో ఓ సామాన్య గ్రామీణ యువకుడు అంతర్జాతీయ వేదికపై దేశ జెండాను ఎలా ఎగురవేశారనే స్ఫూర్తిదాయక కథాంశంతో సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదలైన టీజర్‌లో మట్టి కుస్తీ నేపథ్యం, భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. మరాఠీ, హిందీతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో ఖాషాబా పాత్రను ఎవరు పోషిస్తున్నారనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్