గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయూట్యూబర్‌ వెంకటరామిరెడ్డికి 14 రోజులు రిమాండ్

48 నిమిషాల క్రితం

bbl kvr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 10:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-బొబ్బిలి టౌన్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబర్ కె వెంకటరామిరెడ్డి (కెవిఆర్‌)కి బొబ్బిలి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ పై వెంకటరామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయనగరం జిల్లా బాడంగి గ్రామ మాజీ సర్పంచ్ కండి రమేష్ బాడంగి పోలీసులకు రెండు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కెవిఆర్‌‌ను గురువారం బొబ్బిలి రూరల్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యాన అరెస్టు చేసి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇరు వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి కెవిఆర్‌‌కు 14 రోజులు రిమాండ్ విధించారు. కోర్టు ఆర్డర్‌‌ను తీసుకొని వెనువెంటనే రూరల్ సిఐ శ్రీనువాసరావు తన సిబ్బందితో కలిసి బొబ్బిలిలోని సబ్ జైలుకు ఆయనను తరలించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్