mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నూతన ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ ధీరజ్‌ సేథ్‌

3 గంటల క్రితం

Gen Dhiraj Seth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 03:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నూతన ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆర్మోర్డ్ కార్ప్స్ (ట్యాంక్ రెజిమెంట్) విభాగం నుంచి ఆర్మీ చీఫ్ పదవిని అధిష్టించిన 7వ అధికారిగా ఆయన రికార్డు సృష్టించారు. సౌత్ బ్లాక్ లాన్స్‌లో సైనిక సంప్రదాయాల మధ్య అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా (సిఒఎఎస్‌) బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేశారు.

జనరల్‌ సేథ్‌ ఖడక్‌వాస్లాలోని జాతీయ రక్ష‍ణ అకాడమీ (ఎన్‌డిఎ)పూర్వ విద్యార్థి. ఆయన 1986లో ఆర్మర్డ్‌ కార్ప్స్‌లో నియమితులయ్యారు. ఆర్మీ కమాండర్ హోదాకు పదోన్నతి పొందిన తర్వాత, ఆయన జైపూర్‌లోని సౌత్ వెస్ట్రన్ కమాండ్ (దక్షిణ పశ్చిమ కమాండ్), సదరన్ కమాండ్ (దక్షిణ కమాండ్)లకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. పశ్చిమ సరిహద్దు వెంబడి రెండు ఆపరేషనల్ కమాండ్‌లకు నాయకత్వం వహించిన అరుదైన ఘనతను సాధించినట్లు రక్ష‍ణశాఖ పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్