mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జస్పాల్ రాణా మరణించిన 16 రోజులకు తల్లి శ్యామా దేవి కన్నుమూత

1 రోజు క్రితం

భారత మాజీ షూటర్ జస్పాల్ రాణా కుటుంబంలో మరో విషాదం నెలకొంది.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : భారత మాజీ షూటర్ జస్పాల్ రాణా కుటుంబంలో మరో విషాదం నెలకొంది. జస్పాల్ రాణా మరణించి 16 రోజులు గడవకముందే ఆయన తల్లి శ్యామా దేవి రాణా కూడా కన్నుమూశారు. జూన్ 12 న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ జస్పాల్ రాణా తుదిశ్వాస విడిచిన సంగతి విదితమే. ఇదిలా ఉండగా .... శ్యామా దేవి కూడా గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆదివారం ఢిల్లీలో ఆమె మృతి చెందారు. ఈ విషాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. '' శ్యామా దేవి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటీవలే భారత మాజీ షూటర్ జస్పాల్ రాణాను కోల్పోయిన ఆ కుటుంబానికి ఇది మరో తీరని విషాదం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వరుసగా ఎదురవుతున్న ఈ దుర్ఘటనలను తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబానికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను '' అని పుష్కర్ సింగ్ ధామి తన పోస్టులో పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్