జైపూర్ : జైపూర్‌లో గోడ కూలి ముగ్గురు మృతి చెందారని సోమవారం అధికారులు తెలిపారు. ఈ ఘటన జైపూర్‌లోని చంద్వాజి తలా మోర్ ప్రాంతంలో జరిగింది. జైపూర్-ఢిల్లీ హైవేపై పంజాబ్ హోటల్ ఎదురుగా ఉన్న ఆరావళి ప్యాలెస్ రిసార్ట్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడ డ్రైనేజీ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఆదివారం గోడ కూలింది. ఈ ప్రమాదలో ఇద్దరు మహిళలు ఒక పురుషుడు మృతి చెందారు. డజన్లమందికి పైగా గాయాలపాలయ్యారు. గాయాలైన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుప్రతికి తరలించినట్లు జైపూర్ గ్రామాణ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) హనుమాన్ ప్రసాద్ మీనా వెల్లడించారు.
కాగా, ఈ డ్రైనేజీ పనులు చేసిన కూలీల్లో ఎక్కువ శాతం బీహార్‌కి చెందినవారేనని అధికారులు వెల్లడించారు.









కామెంట్లు (0)