- మెక్సికోలో నలుగురు మృతి
మెక్సికో సిటీ: ప్రపంచకప్‌లో మెక్సికో జట్టు విజయం అనంతరం దేశవ్యాప్తంగా జరిగిన సంబరాలు విషాదానికి దారితీశాయి. అభిమానుల భారీ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న పలు ప్రమాదాల్లో ఒక బాలికతో సహా నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుల్లో 44 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల యువతి, 48 ఏళ్ల మహిళ ఉన్నారు. మరో మృతుడు సుమారు 30 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపింది. గాయపడిన వారిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మెక్సికో విజయం తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. అయితే భారీ జనసందోహం, అదుపు తప్పిన వాహనాల రాకపోకలు, కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల కారణంగా పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, భద్రతా బలగాలు అత్యవసరంగా రంగంలోకి దిగాయి. గాయపడిన వారికి వైద్యసేవలు అందిస్తున్న అధికారులు, ప్రమాదాలపై దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, ప్రపంచకప్ ప్రీక్వార్టర్స్‌లో భాగంగా సోమవారం మెక్సికో బలమైన ఇంగ్లాండ్‌తో తలపడనుంది.







కామెంట్‌లు (0)