- వెంటనే విడుదల చేయాలి
- సిఐటియు డిమాండ్
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఓబులవారి పల్లి మండలం మంగంపేటకు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్న సందర్భంగా సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సిహెచ్ చంద్రశేఖర్ ను గురువారం ఉదయం తమ ఇంటికి వెళ్లి పోలీసులు అరెస్టు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని, వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తారని ఉద్దేశంతో ప్రభుత్వం భయపడి సిఐటియు నాయకులు ఇళ్లకు వెళ్లి అరెస్టు చేయడం తగదన్నారు. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా నాయకులును అరెస్ట్ చేయడం, నిర్బంధించడం, అక్రమ కేసులు బనాయించడం వంటి చర్యలకు పాల్పడడాన్ని తప్పుపట్టారు. మంగంపేట బెరైటీస్ ను పరిరక్షించాలని, బల్క్ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులను పర్మినెంట్ చేయాలని, నిర్వాసితులను ఆదుకోవాలని తదితర సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించాలని టి.సుబ్రమణ్యం డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన చంద్రశేఖర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు .








కామెంట్‌లు (0)