న్యూఢిల్లీ : అయోధ్య రామాలయం విరాళాల్లో అవకతవకలు, విద్యార్థులపై పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు గురువారం ఉదయం పార్లమెంటులోని మకరద్వారం ఎదుట నిరసన చేపట్టారు. జులై 20న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు చర్య తీసుకోవాలని ఎవరు ఆదేశాలు జారీ చేశారో వెల్లడించాలని కేంద్రాన్ని నిలదీశారు. పోలీసుల దౌర్జన్యం, విరాళాల అవతవకలపై కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించాలని నినాదాలు చేశారు. పబ్లిక్ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు, 2026ని పరిశీలన ఆమోదం కోసం పరాజ్యసభలో ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు ఇండియా బ్లాక్ నిరసన చేపట్టింది. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు ప్రతిపక్షాలు నేడు సమావేశం కానున్నాయని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపి సయ్యద్ నసీర్ హుస్సేన్ తెలిపారు. విద్యార్థులపై పోలీసుల చర్యలను పార్లమెంటులో లేవనెత్తడమే ఈ నిరసన లక్ష్యమని అన్నారు. నిరసనకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. నిరసనలు ప్రతిరోజూ చేపడుతున్నామని, విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, అనంతరం విద్యార్థులు కేంద్రంతో జరిపిన చర్చ లసందర్భంగా కొన్ని హామీలు ఇచ్చారని అన్నారు. ప్రతిపక్షం సైతం మూడు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉంచిందని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పోలీసుల చర్యపై పార్లమెంటులో ప్రకటన, ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం మూడు డిమాండ్లు ఉన్నాయని, ఒకటి, ప్రధాన్ రాజీనామా చేయాలని, రెండు, పోలీసుల అరాచకాలపై కేంద్రం సభకు వచ్చి ప్రకటన చేయాలని అన్నారు. ప్రధాని క్షమాపణలు చెప్పాలని.. కానీ ఈ రెండు డిమాండ్లు అలాగే ఉన్నాయని సయ్యద్ నసీర్ హుస్సేన్ అన్నారు.ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తారని, దీంతో పోలీసుల చర్యలకు సంబంధించి హోం మంత్రే సమాధానం చెప్పాలని హుస్సేన్ స్పష్టం చేశారు. రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో బాధ్యతను నిర్ధారించాలన్న తమ పార్టీ డిమాండ్‌ను సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ పునరుద్ఘాటించారు.
పార్లమెంటు ఎదుట ప్రతిపక్షాల నిరసన
30 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 30, 2026, 11:43 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)