గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆకుకూరలు-ఆరోగ్యం

1 గంట క్రితం

ఆకుకూరలు.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 04:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తోటకూరను చూసి తొలగిపోవద్దురా

పాలకూరని చూసి పారిపోవద్దురా

బచ్చలాకును చూసి భయపడుట తగదురా

గోంగూరని చూసి గోల పెట్టుట ఏల?

చుక్కకూరను నీవు చులకనగా చూడకు

పుదీనా వాసనకు పులకించి తీరాలి

మునగాకు వంటలో ముఖ్యమని గుర్తించు

కరివేప ఆకులను కటువుగా ఏరకుము

పొన్నగంటిని తినగ కన్నులకు మంచిదగు

కొత్తిమీరను పెంచి కొరత లేకనె వాడు

గలిజేరు వండుకుని గట్టిమేలును పొందు

మెంతి కూరను తినగ మంచిదని గుర్తించు

ముల్లంగి ఆకులను ముచ్చటగ తినవచ్చు

ఆవాకు పప్పుతో ఆరోగ్యమే కలుగు

వామాకు బజ్జీలు వద్దనక తింటావు

ఆనపాకుల వంట అమ్మమ్మనే అడుగు

ఏ‌కాలమైననూ ఏ మాసమైననూ

దొరికినా ఆకులను దొరలాగ తినుమురా

ఆరోగ్యమూ, అందమూ నిజమురా!

అమ్మ చెంతన చేరి ఆకుకూరలు అడిగి

కమ్మగా తిని చూడు కడుపార తిని చూడు

నిజమైన రుచినెరిగి నిండుగా నవ్వెదవు!

గుడిపూడి రాధికా రాణి,

94949 42583.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్