- లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభ ట్రేడింగ్‌లోనే భారీ లాభాలను నమోదు చేశాయి. మునుపటి సెషన్‌లో 76,922.64 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం 77,083.14 వద్ద ప్రారంభమై, 365 పాయింట్లు లాభపడి 77,287.95 స్థాయికి చేరింది. అలాగే 24,005.85 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50, 24,062.20 వద్ద ప్రారంభమై 100 పాయింట్లకు పైగా పెరిగి 24,106.20 వద్ద ట్రేడైంది. ఈరోజు మార్కెట్ ర్యాలీకి ఐటీ దిగ్గజాల షేర్లే ప్రధాన బలంగా నిలిచాయి. ఇన్ఫోసిస్ షేరు 4.10 శాతం ఎగబాకి రూ.985.30 నుంచి రూ.1,025.70కు చేరగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు 3.77 శాతం పెరిగి రూ.1,073.20 వద్ద ట్రేడైంది. టీసీఎస్ షేరు 2.77 శాతం లాభపడి రూ.2,037.50కు చేరగా, టెక్ మహీంద్రా షేరు 2.45 శాతం పెరిగి రూ.1,395.60 వద్ద నమోదైంది. ఐటీసీ షేరు కూడా 1.54 శాతం లాభంతో రూ.284 వద్ద ట్రేడైంది. నిఫ్టీ-50లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు అత్యధిక లాభాలు నమోదు చేశాయి. మరోవైపు ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ఓఎన్‌జీసీ షేర్లు ప్రారంభ ట్రేడింగ్‌లో నష్టాల్లో కొనసాగాయి.
బుధవారం సెన్సెక్స్ 443.97 పాయింట్లు పెరిగి 76,922.64 వద్ద ముగియగా, నిఫ్టీ 140.10 పాయింట్లు లేదా 0.59 శాతం లాభపడి 24,005.85 వద్ద స్థిరపడింది. ఐటీ రంగంలో కొనుగోళ్ల ఊపు కొనసాగుతుండటంతో మార్కెట్లలో సానుకూల ధోరణి కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








కామెంట్‌లు (0)