గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆదర్శవంతంగా తాడిపర్రు పీఏసీఎస్

1 గంట క్రితం

kandula
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 11:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- పీఏసీఎస్ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్

ప్రజాశక్తి - ఉండ్రాజవరం: రాష్ట్రంలోని అన్ని సొసైటీలకు తాడిపర్రు పీఏసీఎస్ ఆదర్శవంతంగా నిలిచిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. గురువారం మండలంలోని తాడిపర్రులో సొసైటీ అధ్యక్షుడు దుర్గా బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సొసైటీ నూతన పవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి, మాట్లాడారు. 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన భవన నిర్మాణం లో భాగంగా ప్రతి విషయానికి ప్రభుత్వంపైనే ఆధారపడకుండా, సొసైటీ సొంత నిధులు,27.63 లక్షలు, రైతులకు డివిడెంట్ రూపంలో పంచె నిధులు16.48 లక్షలు, సహకార సాధారణ నిర్మాణాల నిధులు 15.89 లక్షలు, గ్రామానికి చెందిన కోడూరి నిరంజన్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అందించిన రూ.10 లక్షల విరాళంతో పాటు సభ్యుల సహకారాన్ని కూడగట్టి, ఈ భవన నిర్మాణానికి పూనుకోవడం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమన్నారు. ఈ నూతన భవనంలో క్రింది భాగంలో అత్యాధునిక గోడౌన్, పై అంతస్తులో కార్యాలయం నిర్మిస్తున్నారని, ఇది రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రెండు సంవత్సరాల పాలనా కాలంలోనే తాడిపర్రు గ్రామాభివృద్ధికి రూ.3.84 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. విజయవాడలో అత్యవసర పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ, దైవానుగ్రహంతో ఈ పవిత్ర శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు డివిజనల్ సహకార సంఘం అధికారి ఎం జగన్నాథరెడ్డి, సబ్ డివిజనల్ అధికారి కే సుబ్బారావు, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, సొసైటీ సీఈవో సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్