ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వాయువ్య బంగాళాఖాతం,ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు. మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.శుక్రవారం మేఘావృతమైన వాతావరణంతో పాటు శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలని తెలిపారు.
Print Editionఒడిశా-బెంగాల్ తీరప్రాంతాల్లో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 11:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)