గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘శ్రీచక్ర’లాకౌట్‌ను ఎత్తివేయాలి : సిఐటియు డిమాండ్

1 గంట క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 11:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో ఉన్న శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీని యాజమాన్యం లాకౌట్ ను వెంటనే ఎత్తివేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. హఠాత్తుగా లాకౌట్ ప్రకటించడం అన్యాయమని యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌ ‌నర్సింగరావు, ఎవి నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లాకౌట్ వల్ల 200 కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టప్రకారం కనీసం కార్మికులకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా, తెలియపర్చకుండా రాత్రికి రాత్రి ఉద్యోగ కార్మికులకు ఫ్యాక్టరీ గేటు ముందు నోటీసు అంటించి ఒక నెల జీతం ఇస్తాము వెళ్లిపోండని ప్రకటించడం ఘరోమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఉపాధి నిమిత్తం అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి బోనస్ లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోయినా సంస్థ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లూ కార్మికులు కష్టపడి యాజమాన్యాలకు లాభాలు తెచ్చిపెట్టారని పేర్కొన్నారు. అయినా సరే యాజమాన్యం దుర్మార్గంగా లాకౌట్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఒక వైపు రాష్ట్రప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో పారిశ్రామిక వేత్తలకు బ్యాంకుల్లో రుణాలు, స్థలాలు, మైనింగ్ వంటి అనేక రాయితీలు కల్పిస్తున్నా కార్మికులకు కనీసవేతనాలు, వారికి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, బోనస్, పిఎఫ్, టిఎ,డిఎలు ఇవ్వకుండా విపరీతంగా లాభాలు సంపాదించుకొని హఠాత్తుగా లాకౌట్ ప్రకటించడంపై లేబర్ డిపార్ట్ మెంట్, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి కార్మికుల జీవితాలు నిలబెట్టాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్