- భార్యభర్తలు మృతి
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి - వేంపల్లె : కడప జిల్లా వేంపల్లె మండలంలోని తాళ్లపల్లె గ్రామ ప్రధాన రహదారిలో మిక్చర్ పెట్టుకొని అమ్ముకొంటున్న తొపుడు బండిపైకి లారీ దూసుకొని పోయింది. దీంతో ఈ ఘటనలో భార్యాభర్తలు ఇద్దరు అక్కడ్కడికే మృతి చెందారు. స్థానికుల వివరాలు మేరకు వివరాల్లోకి వెళ్తే తాళ్లపల్లె గ్రామానికి చెందిన వెంకట లక్ష్ముమ్మ (40), వెంకట శేషు మురళి (45)అనే భార్యభర్తలు ఇరువురు కలిసి జీవనోపాధి కోసం తొపుడు బండిపై మిక్చర్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. రోజు లాగే కూడ భార్యభర్తలు ఇరువురు కలిసి మిక్చర్ అమ్ముకొంటుండగా బుధవారం సాయంత్రం వేంపల్లె నుండి బెంగళూరుకు వెళ్లుతున్న లారీ తాళ్లపల్లి గ్రామ సమీపంలో కి రాగానే ప్రధాన రహదారి పక్కన ఉన్న తొపుడు బండి పైకి లారీ దూసుకొని వెళ్లింది. దీంతో భార్యభర్తలైన కళ్యాణి, వెంకట శేఘ మురళిలు అక్కడికి అక్కడే మృతి చెందడం జరిగింది. అలాగే పక్కనే ఉన్న మరో కూల్ డ్రింక్ షాపు పెట్టుకొని వ్యాపారం చేసుకొంటున్న ఇద్దరికి కూడ తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఘటన తెలిసిన వెంటనే సిఐ నర్సింహులు తాళ్లపల్లికు వెళ్లి ప్రమాదంపై ఆరా తీశారు. అలాగే మృతదేహలను వేంపల్లె ఆసుపత్రికి తరలించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.







కామెంట్‌లు (0)