గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA: బోస్నియాపై అమెరికా విజయం

1 గంట క్రితం

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 08:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

శాన్‌ ఫ్రాన్సిస్కో: పది మందికే పరిమితమైనప్పటికీ ఆతిథ్య అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో భాగంగా జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో బోస్నియా-హెర్జెగోవినాపై 2-0 తేడాతో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అమెరికా 32వ నిమిషంలో ఫోలారిన్ బలోగన్ చేసిన గోల్ ఆఫ్‌సైడ్ కారణంగా రద్దయింది. అయితే తొలి అర్ధభాగం ముగిసే వేళ బోస్నియా డిఫెండర్‌ను తాకి వెనక్కి వచ్చిన బంతిని బలోగన్ నెట్‌లోకి పంపి అమెరికాకు 1-0 ఆధిక్యం అందించాడు. రెండో అర్ధభాగంలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. 64వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడు ముహారెమోవిచ్ చీలమండపై ప్రమాదకరంగా టాకిల్ చేసిన ఘటనను వీడియో అసిస్టెంట్ రిఫరీ (విఏఆర్) ద్వారా పరిశీలించిన అనంతరం బలోగన్‌కు రెడ్ కార్డు చూపించడంతో అమెరికా పది మందికే పరిమితమైంది. అయినప్పటికీ అమెరికా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. పది మందితోనే సమర్థంగా పోరాడిన ఆ జట్టు 82వ నిమిషంలో మాలిక్ టిల్మాన్ గోల్‌తో ఆధిక్యాన్ని 2-0కు పెంచి విజయాన్ని ఖాయం చేసుకుంది. చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరిన బోస్నియా పోరాడినప్పటికీ అమెరికా రక్షణను ఛేదించలేకపోయింది. దీంతో ఆతిథ్య జట్టు జూలై 7న జరిగే ప్రీక్వార్టర్స్‌లో బెల్జియంతో తలపడనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్