mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముంబయిలో భారీ వర్షం .. నాలుగు గంటల్లో 100మి.మీపైగా వర్షపాతం

1 రోజు క్రితం

Heavy overnight showers drench Mumbai suburbs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 10:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబయి శివారు ప్రాంతాల్లో ఆదివారం అర్థరాత్రి కుండపోత వర్షం కురిసింది. కేవలం నాలుగు గంటల్లోనే పలు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో చాలా చోట్ల వరదనీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు సోమవారం తెలిపారు. తూర్పు శివారు ప్రాంతమైన ములుంద్‌లోని వీణానగర్‌లో 160.4మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, పశ్చిమ శివారు ప్రాంతమైన వెర్సోవాలో 156.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బృహన్‌ ముంబయి మునిసిపల్‌ కార్పోరేషన్‌ (బిఎంసి) ఒక ప్రకటనలో తెలిపింది. మంఖుర్ద్‌లోని మహారాష్ట్ర నగర్‌ పాఠశాల వద్ద 123.4మి.మీ, పోయివాలోని పొస్పోలి మునిసిపల్‌ పాఠశాల సమీపంలో122మి.మీ, ములుంద్‌లోని మిథానగర్‌ మునిసిపల్‌ పాఠశాల వద్ద 120.8మి.మీ, ఎస్‌ వార్డు కార్యాలయంలో 120.6మి.మీ వర్షపాతం నమోదైనట్లు బిఎసింసి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం అర్థరాత్రి నుండి సోమవారం తెల్లవారుజామున 4.00గంటల వరకు భారీ వర్షం కురవడంతో ములుంద్‌లోని ఎబిఎస్‌ రోడ్‌, అందేరీ సబ్‌వేల్లో భారీగా వరదనీరు చేరినట్లు పేర్కొంది. అలాగే పశ్చిమ శివారు ప్రాంతాల్లో వెర్సోనా పంపింగ్‌ స్టేషన్‌లో 121.6మి.మీ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన ప్రాంతాల్లో 100మి.మీకు పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్