mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జైపూర్‌ : గోడ కూలి ముగ్గురు మృతి

1 రోజు క్రితం

wall collapsed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జైపూర్‌ : జైపూర్‌‌లో గోడ కూలి ముగ్గురు మృతి చెందారని సోమవారం అధికారులు తెలిపారు. ఈ ఘటన జైపూర్‌‌లోని చంద్వాజి తలా మోర్‌ ‌ప్రాంతంలో జరిగింది. జైపూర్-ఢిల్లీ హైవేపై పంజాబ్ హోటల్ ఎదురుగా ఉన్న ఆరావళి ప్యాలెస్ రిసార్ట్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడ డ్రైనేజీ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఆదివారం గోడ కూలింది. ఈ ప్రమాదలో ఇద్దరు మహిళలు ఒక పురుషుడు మృతి చెందారు. డజన్లమందికి పైగా గాయాలపాలయ్యారు. గాయాలైన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుప్రతికి తరలించినట్లు జైపూర్‌ ‌గ్రామాణ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ (‌డిసిపి) హనుమాన్‌ ‌ప్రసాద్‌ ‌మీనా వెల్లడించారు.

కాగా, ఈ డ్రైనేజీ పనులు చేసిన కూలీల్లో ఎక్కువ శాతం బీహార్‌‌కి చెందినవారేనని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్