ఇంఫాల్ : దోపిడీ, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మణిపూర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన 55ఏళ్ల వ్యక్తిని బుధవారం ఇంఫాల్ వెస్ట్ జిల్లా పాత్సోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తబుంగ్‌ఖోక్ ప్రాంతం నుండి, నిషేధిత ఎన్‌ఆర్‌ఎఫ్‌ఎంకి చెందిన 26ఏళ్ల వ్యక్తిని అదే పోలీస్ స్టేషన్ పరిధి నుండి మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది. మూడేళ్ల క్రితం మైతేయి, కుకీ-జో వర్గాల మధ్య జాతి ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు, నిఘా తీవ్రతరం చేశాయని పోలీసులు తెలిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన జాతి ఘర్షణల్లో 260మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
మణిపూర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 10:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)