mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉపాధిని దెబ్బకొట్టే జి రాంజీ పథకం ప్రారంభానికి వస్తున్న కేంద్ర మంత్రి పర్యటనను నిరసించండి

19 జూన్, 2026

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 03:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉపాధిని దెబ్బకొట్టే జి రాంజీ పథకం ప్రారంభానికి వస్తున్న కేంద్ర మంత్రి పర్యటనను నిరసించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ కార్మికులకు పని హక్కుగా వున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కొత్తగా తెచ్చిన పథకం జి రామ్ జి ని మన రాష్ట్రం నుండే ప్రారంభించడానికి జూలై 1న వస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటనను నిరసించాలని పిలుపునిచ్చారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో కమ్యూనిస్టుల ఒత్తిడితో తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బలహీనం చేస్తూ దానికి నిధులు తగ్గిస్తూ వచ్చిందని, ఒకేసారి రద్దు చేస్తే పేదల్లో వ్యతిరేకత వస్తుందని దశలవారీగా రద్దు చేయడం కోసం జీ రాంజీ జి తెచ్చిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 శాతంగా ఉన్న నిధులను 60:40 శాతంగా మార్చారని, జి రాంజీ ని పార్లమెంటులో బలపరిచిన తెలుగుదేశం పార్టీ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4000 కోట్ల అదనపు భారం పడుతుందని చెబుతుందని తెలిపారు. అంత భారం ప్రభుత్వం భరించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారని, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభించిన అనంతపురం జిల్లాలోనే జీ రాంజీని ప్రారంభించడం రాష్ట్రాన్ని అవమానించడమేనని తెలిపారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండు చేశారు. కేంద్ర మంత్రి పర్యటనను నిరసించాలని గ్రామీణ పేదలకు, వ్యవసాయ కార్మికులకు, రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పట్టణీకరణ, వలసలు పెరుగుతున్న దృష్ట్యా పాత పథకాన్ని పునరుద్దరించి పట్టణాలకు కూడా విస్తరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి పథకంలో అవినీతి ఉందన్న పేరుతో ఫేస్‌యాప్ పెట్టి కూలీలను వేధిస్తున్నారని, ఉన్నత స్థాయిలో అవినీతిని అరికట్టకుండా ఉపాధి కూలీలపై నెపం వేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఆ పేరుతో ఫేస్‌యాప్ పెట్టడంవల్ల పని ప్రదేశాల్లో నెట్ లేనందున పనిచేసే కూలి దక్కని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అందువల్ల వెంటనే ఫేస్‌యాప్‌ను ఉపసంహరించుకోవాలి. ప్రస్తుత ధరలలో కూలీ గిట్టుబాటు కావడం లేదని, కనీసం రోజుకి రూ.600 ఇవ్వాలని, పని దినాలు పెంచాలని డిమాండు చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పనులు దొరకక వలసలు పోతున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఈ సంవత్సరం ఏలినినో ప్రభావంతో వర్షాలు లేక గ్రామాల్లో పనులు మరింత తగ్గిపోతాయని చెబుతున్న ప్రభుత్వమే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే చర్యలు చేపట్టడం సరికాదని తెలిపారు.



cpim letter

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్