mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎల్లమ్మలో సురభి

1 గంట క్రితం

SurabhiLakshmi-1782798873322-2862.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 08:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘బలగం’ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో రాబోతున్న ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. ఈ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎల్లమ్మ దేవతను ఆరాధించే గ్రామీణ జానపద కళాకారుల బృందం, వారి జీవన పోరాటం, వారి ఆత్మగౌరవం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని సమాచారం. తెలంగాణ గ్రామీణ సంస్కృతి, ఇక్కడి జానపద కళల వైభవం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవబోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటివరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేయలేదు. మొదట్లో సాయిపల్లవి, కీర్తి సురేష్ పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ప్రస్తుతం సురభి కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆమె భాగం చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ కూడా తాజాగా ఈ చిత్రంలో చేరినట్లు సమాచారం.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్