mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొల్‌‌కతాలో కుప్పకూలిన గిడ్డంగి !

6 రోజుల క్రితం

Several trapped after under-construction warehouse
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ముగ్గురు మృతి, 18 మందికి గాయాలు

కోల్‌‌కతా : బిజెపి పాలిత పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్ర రాజధాని కొల్‌‌కతాలో నిర్మాణంలో ఉన్న గిడ్డంగి కూలిపోవడంతో ముగ్గురు చనిపోయారు. మరో 18 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తారతలా ఏరియాలో బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాగా కూలిన శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో 50 నుండి 60 మంది పనిచేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి సువేందు అధికారి, మరికొందరు మంత్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 21 మందిని బయటకు తీశారని, వారిలో ముగ్గురు మరణించారని సిఎం బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఇంకా శిధిలాల కింద 18 మంది చిక్కుకున్నారని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్ళినట్లు చెప్పారు. భారీ కాంక్రీట్‌ ‌దిబ్బల కింద చిక్కుకుపోయిన వారిని వెంటనే కనుగొనడానికి, బయటకు తీయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు సిఎం వెల్లడించారు. నగర పాలనా యంత్రాంగం నుండి అభ్యర్ధన అందిన వెంటనే భారత నావికాదళానికి చెందిన తూర్పు కమాండ్‌ ‌బలగాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్