గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionSri Lanka A vs India A, Test, శ్రీలంక-ఎ 288/5

1 గంట క్రితం

test
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 10:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గాలే: శ్రీలంక-ఎతో జరుగుతున్న రెండో అనధికర టెస్ట్ తొలి రోజులో భారత-ఎ బౌలర్లు తేలిపోయారు. ఫ్లాట్ వికెట్‌పై బౌలింగ్ చేయడం ఇండియా పేసర్లకు కఠిన సవాల్‌గా మారింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఏ జట్టు తొలిరోజు ఆట ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో సహన్ అరచ్చిగే(83 నాటౌట్‌) క్రీజులో ఉండగా.. అంజల బండార(42), నువనిదు ఫెర్నాండో(44) రాణించారు. సహన్‌కు తోడు గుణశేఖర(6) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు పవంత(39), లివేరా(28) తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సారాన్ష్ జైన్ తలా 2 వికెట్లు పడగొట్టగా.. గుర్నూర్ బ్రార్ ఓ వికెట్ సాధించాడు. రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌ డ్రా అయ్యింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్