mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionFIFA World Cup: ప్రీ క్వార్టర్స్‌కు కెనడా

1 రోజు క్రితం

canada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • చివర్లో స్టీఫెన్ యూస్టాకియో గోల్‌

  • రౌండ్‌-32లో దక్షిణాఫికాపై గెలుపు

లాస్‌ఏంజిల్స్‌: ఫిఫా ప్రపంచకప్‌ 2026 ప్రి క్వార్టర్‌ ‌ఫైనల్లోకి ఆతిథ్య కెనడా జట్టు ప్రవేశించింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో కెప్టెన్ స్టీఫెన్ యుస్టాకియో కొట్టిన చివర్లో కొట్టిన అద్భుతమైన గోల్ తో కెనడా జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో రౌండ్ ఆఫ్ 16లో స్థానం సంపాదించిన తొలి జట్టుగా కెనడా నిలిచింది. లాస్ ఏంజిల్స్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌‌లో యూస్టాకియో తన షాట్‌ను దక్షిణాఫ్రికా గోల్ కీపర్ రాన్‌వెన్ విలియమ్స్‌కు కుడివైపుగా పంపి గోల్‌‌గా మలిచాడు. 92వ నిమిషంలో సాధించిన గోల్ తో ఆతిథ్య దేశమైన కెనడాజట్టు 1-0తో దక్షిణాఫ్రికాను ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. రౌండ్‌-32 తొలి మ్యాచ్‌‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇరుజట్లకు ఇది తొలి ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ కావడంతో ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగింది. ఆతిథ్య దేశమైన కెనడా దూకుడుగా ఆడుతూ గోల్ కోసం ప్రయత్నించింది. అయితే దక్షిణాఫ్రికా డిఫెండర్లు, ముఖ్యంగా గోల్ కీపర్ రోన్వెన్ విలియమ్స్ కెనడా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాడు. ఈ మ్యాచ్‌లో విలియమ్స్ రికార్డు స్థాయిలో 77 సక్సెస్‌ఫుల్ పాస్‌లు ఇచ్చి, 2022లో మాన్యుయెల్ నోయర్ (51 పాస్‌లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కెనడా ఆటగాళ్లు డెరెక్ కార్నెలియస్, మోయిస్ బొంబిటో, తజోన్ బుకానన్ హెడర్ల ద్వారా గోల్స్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, దక్షిణాఫ్రికా కీపర్ విలియమ్స్ నిలవరించడం విశేషం. ఇక మ్యాచ్ 75వ నిమిషంలో కెనడా స్టార్ ప్లేయర్ అల్ఫోన్సో డేవిస్ మైదానంలోకి వచ్చినప్పటికీ దక్షిణాఫ్రికా డిఫెన్స్‌ను ఛేదించడం కష్టంగా మారింది. మ్యాచ్ అదనపు సమయానికి వెళ్తుందనుకున్న దశలో యుస్టాకియో మ్యాజిక్ చేశాడు. 92వ నిమిషంలో దక్షిణాఫ్రికా డిఫెండర్ ఒకాన్ క్లియర్ చేసిన బంతిని యుస్టాకియో తన ఛాతీతో నియంత్రించి, పెనాల్టీ బాక్స్ బయటి నుంచి ఒకే ఒక్కలో షాట్‌తో గోల్ పోస్ట్ లెఫ్ట్‌ నెట్‌లోకి పంపాడు. లోకల్ లాస్ ఏంజెల్స్ ఎఫ్‌సి క్లబ్ తరఫున ఆడే యుస్టాకియోకు ఈ స్టేడియం సొంత మైదానం కావడం విశేషం. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో గోల్ చేసిన మూడవ ఎంఎల్ఎస్ ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో కెనడా ఫుట్‌బాల్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే కెనడా తొలిసారి ప్రిక్వార్టర్స్‌ చేరింది. కెనడా జట్టు శనివారం జరిగే ప్రి క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్/మొరాకో మ్యాచ్‌ ‌విజేతతో తలపడనుంది.


ఫిఫా ప్రపంచకప్‌‌ రౌండ్-32లో నేడు...

30(మంగళ) : నెదర్లాండ్స్ × మొరాకో

(వేదిక: ఎమెక్సికో, మెక్సికో; ఉ.6.00గం.లకు)

ఐవరీ కోస్ట్ × నార్వే

(వేదిక: డల్లాస్ స్టేడియం; రా10.30గం.లకు)

01(బుధ) : ఫ్రాన్స్ × స్వీడన్

(న్యూ జెర్సీ స్టేడియం; తె.2.30గం.లకు)


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్