mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాబో వెర్డే కేక

3 రోజుల క్రితం

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:16 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

రౌండ్‌-32కు చేరిన చిన్ని దేశంగా రికార్డుల్లోకి

3న అర్జెంటీనాతో ఢీ రేపటి నుంచి నాకౌట్‌ ‌మ్యాచ్‌‌లు దక్షిణాఫ్రికా × కెనడా మ్యాచ్ తో ప్రారంభం

హూస్ట‌న్: ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీలో అరంగ్రేటం చేసిన అతిచిన్న దేశంగా చరిత్ర పుటల్లో నిలిచిన కాబో వెర్డే... ఏకంగా నాకౌట్‌‌కు చేరి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తొలి మ్యాచ్‌‌లో 2010 ఫిఫా ఛాంపియన్‌ స్పెయిన్‌‌ను 0-0తో నిలువరించిన ఈ చిన్ని దేశం.. రెండో మ్యాచ్‌‌లో ఏకంగా రెండుసార్లు ఛాంపియన్‌ ఉరుగ్వేతో మ్యాచ్‌‌ను 2-2తో ‌డ్రాగా ముగించింది. ఈ క్రమంలోనే శనివారం జరిగిన మూడో, చివరి లీగ్‌ ‌మ్యాచ్‌‌లోనూ సౌదీ అరేబియాతో 0-0తో ముగించింది. దీంతో మూడు లీగ్‌ ‌మ్యాచ్‌‌లనూ డ్రా చేసుకొన్న కాబో వెర్డే గ్రూప్‌-‌హెచ్‌‌లో ఏకంగా 2వ స్థానంలో నిలిచి నేరుగా రౌండ్‌-32కు చేరింది. దీంతో గ్రూప్ హెచ్‌లో మూడు పాయింట్ల‌తో ఆ దేశం రెండో స్థానంలో నిలిచింది. ఈ గ్రూపు నుంచి స్పెయిన్ టాప్‌‌లో నిలిచి నేరుగా నాకౌట్‌కు చేరింది. లీగ్‌ ‌దశలో ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌కుండా నాకౌట్‌లోకి కాబో ఎంట్రీ ఇచ్చింది. గ‌తంలో 2002లో సెనెగ‌ల్ దేశం కూడా గ్రూప్ స్టేజ్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌కుండా నాకౌట్ ద‌శ‌కు వెళ్లింది. ఈ టోర్నీలో కాబో వెర్డే నిల‌క‌డ‌గా రాణించి అన్ని మ్యాచ్‌ల‌ను డ్రా చేసుకుంది. ఈ క్రమంలోనే ఫిఫా ప్రపంచకప్‌ నాకౌట్ స్టేజ్‌‌కు చేరిన అతిచిన్ని దేశంగా మరో రికార్డును నెలకొల్పింది. నాకౌట్ స్టేజ్‌లో కాబో వెర్డే డిఫెండింగ్‌ ‌ఛాంపియన్‌ అర్జెంటీనాతో పోటీప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌ మియామి వేదికగా జూలై 3న జరగనుంది.

మెక్సికోలోని గ్వాడలహారాలో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ 1-0తో ఉరుగ్వేపై విజయం సాధించింది. దీంతో ఈ గ్రూప్‌‌లో స్పెయిన్‌ ఏడు పాయింట్లతో టాప్ లో నిలిచి నేరుగా ఆఫ్‌-32కు అర్హత సాధించింది. మ్యాచ్‌లో స్పెయిన్‌కు విజయాన్ని అందించిన ఏకైక గోల్‌ను అలెక్స్‌ బయెనా 42వ నిమిషంలో వేశాడు. రెండో అర్ధభాగంలో ఉరుగ్వే దాడులు పెంచినా స్పెయిన్‌ గోల్‌కీపర్‌ ఉనాయ్‌ సిమోన్‌ కీలక సేవ్‌లతో మాథియాస్‌ ఒలివెరా, నికోలాస్‌ డి లా క్రూజ్‌ ప్రయత్నాలను అడ్డుకున్నాడు. ఇంజ్యూరీ టైమ్‌లో పౌ కుబార్సిపై నిర్లక్ష్యంగా టాకిల్‌ చేసిన అగస్టిన్‌ కానోబ్బియోకు రెడ్‌కార్డుతో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో పది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. దీంతో 2010 ఫిఫా ప్రపంచ ఛాంపియన్‌, 2024యూరో కప్‌ విజేత స్పెయిన్‌ మరో టైటిల్‌‌ కోసం నాకౌట్‌‌కు చేరగా ఇక 1930, 1950 ప్రపంచకప్‌లను గెలిచిన ఉరుగ్వే ఈసారి లీగ్ దశలోనే నిష్ర్కమించింది.

ఉస్మాన్‌ డెంబేలే హ్యాట్రిక్‌

గ్రూప్‌-ఐ చివరి మ్యాచ్‌లో నార్వేపై ఫ్రాన్స్‌ అదరగొట్టింది. ఉస్మాన్‌ డెంబేలే హ్యాట్రిక్‌ గోల్స్‌‌తో మెరిసాడు. దీంతో ఫ్రాన్స్‌ ‌జట్టు 4-1 తేడాతో నార్వేను ఓడించి గ్రూప్‌ టాపర్‌‌గా రౌండ్‌-32లోకి ప్రవేశించింది. తొలి అర్ధభాగంలోనే 7, 20, 32వ నిమిషాల్లో ఉస్మాన్‌ డెంబేలే వరుసగా గోల్స్‌ ‌చేశాడు. 21వ నిమిషంలో థియో ఆస్గార్డ్‌ గోల్‌తో నార్వే పోరాడే ప్రయత్నం చేసినా, ఫ్రాన్స్‌ ఆధిపత్యాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. ఇంజ్యురీ టైమ్‌ (90+4వ నిమిషం)లో డిజైర్‌ డౌయే మరో గోల్‌ చేయడంతో ఫ్రాన్స్‌ 4-1తో మ్యాచ్‌‌ను ముగించింది. ఈ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన నార్వే నాకౌట్‌కు చేరగా.. రౌండ్‌-32లో ఫ్రాన్స్‌ ‌జట్టు స్వీడన్‌‌తో, నార్వే జట్టు ఐవరీ కోస్ట్‌‌తో తలపడనున్నాయి. దీంతో ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ చరిత్రలో హ్యాట్రిక్‌ నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా డెంబెలే నిలిచాడు. 1958లో జస్ట్‌ ఫాంటైన్‌ రెండుసార్లు, 2022 ఎంబాపే హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.

సెనెగల్‌ అలవోకగా...

వరుస పరాజయాలతో నాకౌట్‌ ‌బెర్త్‌‌ను సంక్లిష్టం చేసుకున్న సెనెగల్‌ జట్టు కీలక మ్యాచ్‌లో అదరగొట్టింది. గ్రూప్‌-ఐ చివరి మ్యాచ్‌లో 10 మంది ఆటగాళ్లతో ఆడిన ఇరాక్‌ను 5-0 తేడాతో చిత్తుచేసి నాకౌట్‌ (రౌండ్‌ ఆఫ్‌-32) అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి మూడో స్థానంలో నిలిచిన 8 జట్లలో ఒకటిగా నిలవాలంటే భారీ విజయం తప్పనిసరి. ఈ మ్యాచ్‌లో సెనెగల్‌ అదే స్థాయిలో చెలరేగింది. మ్యాచ్‌ మొదలైన నాలుగో నిమిషంలోనే హబీబ్‌ డియారా తొలి గోల్‌తో సెనెగల్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇస్మాయిలా సార్‌, పాపే గుయే, ఇలిమాన్‌ ఎన్‌డియాయే గోల్స్‌ వేసి ఇరాక్‌ డిఫెన్స్‌ను ఛేదించారు. దీంతో ప్రపంచ కప్‌ చరిత్రలోనే సెనెగల్‌ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో గ్రూప్‌-ఐలో ఫ్రాన్స్‌, నార్వే తర్వాత సెనెగల్‌ మూడో స్థానానికి ఎగబాకింది. ఇదే గ్రూప్‌‌లో ఉన్న ఇరాక్‌ ‌వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఓడి నాల్గో స్థానంలో ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్