ఎంఎ బేబీ అభినందనలు
భువనేశ్వర్ :భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్న జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఒకే రోజు ఇద్దరు భారతీయ అథ్లెట్లు తమ విభాగాల్లో చరిత్ర సృష్టించారు. మహిళల లాంగ్ జంప్‌లో 25 ఏళ్ల ఆన్సీ సోజన్ 6.88 మీటర్లు దూకి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పారు. 22 క్రితం ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అంజుబాబీ జార్జ్ నెలకొల్పిన 6.83 మీటర్ల పాత జాతీయ రికార్డును ఆన్సీ అధిగమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "ఇది మానసికంగా, శారీరకంగా సవాలుతో కూడుకున్నది. సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే ఐచి నగోయా ఆసియా క్రీడలకు ముందు ఈ విజయం సంతోషంగా ఉంది," అని అన్నారు. ‘‘కుటుంబంలో ఒకరు జాతీయ రికార్డు హోల్డర్ కావాలని నా తండ్రి కోరుకున్నారు. ఈ స్వర్ణం ఆయనకి అమూల్యమైన బహుమతి,’’ అన్నారు. పురుషుల హైజంప్‌లో సర్వేష్ కుషారే 2.31 మీటర్లు హైజంప్ చేసి కొత్త రికార్డు నమోదు చేశారు. తేజస్విన్ శంకర్ పేరిట ఉన్న 2.29 మీటర్ల రికార్డు చెరిగి పోయింది. సర్వేశ్ ప్రదర్శన హైజంప్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది. ఈ రికార్డులు భారత ఫీల్డ్ ఈవెంట్స్‌లో ప్రతిభకు నిదర్శనంగా ఉన్నాయి.
యువ క్రీడాకారులకు స్ఫూర్తి : ఎంఎ బేబి
జాతీయ రికార్డులు సృష్టించిన క్రీడాకారులను సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అభినందించారు. మహిళల లాంగ్ జంప్‌లో 22 ఏళ్ల నాటి జాతీయ రికార్డును అధిగమించిన ఆన్సీ సోజన్‌కు, పురుషుల హైజంప్‌లో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన సర్వేశ్ కుషారేకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారత అథ్లెటిక్స్ ప్రపంచ వేదికపై మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఈ విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.









కామెంట్‌లు (0)